రాష్ట్ర ప్రజలు కరోనాతో ఇబ్బంది పడుతుంటే.. హైదరాబాద్ లో దాక్కున్న వ్యక్తి నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు వైసీపీ నేతలు. ఊళ్లల్లో జరిగే గొడవల్ని ప్రభుత్వంపైకి నెడుతూ తాను ఎస్సీల ఉద్ధారకుడినని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. గత 14నెలల్లో వివిధ పథకాల ద్వారా 87,23,414 మంది ఎస్సీలు లబ్ధిపొందారని చెబుతున్నారు. టీడీపీ పాలనలో ఎప్పుడైనా ఇంతమందికి సాయం చేసారా అని చంద్రబాబుని ప్రశ్నించారు. ఈనెల 31న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టేందుకు వైసీపీ శ్రేణులు సిద్ధమయ్యాయి.