మహేష్ బాబు, సుధీర్ బాబు కలసి నటిస్తే చూడాలని చాలామంది అభిమానులకు ఉంటుంది. అయితే ఇప్పటి వరకూ అది సాధ్యపడలేదు. అలాంటిది మహేష్ సినిమాలో సుధీర్ బాబు ఏకంగా విలన్ గా కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇటీవల వి సినిమా ప్రమోషన్లో భాగంగా సుధీర్ బాబుకి ఈ ప్రశ్నే ఎదురైంది. మంచి పాత్ర దొరికితే కచ్చితంగా మహేష్ బాబు సినిమాలో కనిపిస్తానని చెప్పారు సుధీర్ బాబు.