రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన, దుర్ఘటన జరిగినా.. దాన్ని రాజకీయ లబ్ధికోసం వాడుకోవాలని చూస్తోంది టీడీపీ. నూతన్ నాయుడు వ్యవాహరంలో కూడా ఇదే చేసింది. పవన్ కల్యాణ్ అభిమాని నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి గుండు కొట్టించి అవమానించిన ఘటన రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. ఈ విషయంలో టీడీపీ వెంటనే రంగంలోకి దిగింది. దళితులపై దాడులు ఆపరా, వైసీపీ ప్రభుత్వంలో ఏంటీ అన్యాయాలు అంటూ రెచ్చిపోయింది. అయితే నూతన్ నాయుడు వ్యవహారంలో టీడీపీ సెల్ఫ్ గోల్ వేసుకుంది. పోలీసులు విచారణకు సిద్ధం కావడం, నిందితులందరిపై కేసులు పెట్టడంతో టీడీపీ గతుక్కుమంది.