కరోనా వైద్యంకోసం ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు, ప్రైవేట్ ఆస్పత్రులు వసూలు చేస్తున్న రేట్లకు చాలా తేడా ఉంది. ప్రభుత్వం నిర్ణయించినట్టు ఫీజులు వసూలు చేయాలంటే రోజుకి 3వేలనుంచి 6వేల రూపాయలు మాత్రమే తీసుకోవాలి. కానీ ప్రైవేట్ ఆస్పత్రులు మినిమమ్30వేలనుంచి మ్యాగ్జిమమ్ లక్ష రూపాయల వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇటీవల సీఎం జగన్ ఈ వ్యవహారంపై దృష్టిసారించాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలిచ్చారు. ఎక్కువ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు.