టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకి సంబంధించి ఏ వార్త బైటకొచ్చినా అది సంచలనంగానే మారుతోంది. తాజాగా ఆయన నటించిన ఓ సినిమా యూట్యూబ్ లో సంచలనం సృష్టించిందనే వార్తలొచ్చాయి. యూట్యూబ్ లో అత్యథిక లైక్ లు పొందిన సినిమాగా డియర్ కామ్రేడ్ రికార్డ్ సృష్టించిందట. అయితే అంత సంచలనం సృష్టించడానికి అదేమీ సూపర్ హిట్ మూవీ కాదు. విజయ్ కెరీర్ లో అర్జున్ రెడ్డి, గీతగోవిందం సూపర్ హిట్లు. మిగతావన్నీ బిలో యావరేజ్ గానే నిలిచాయి. అందుకే డియర్ కామ్రేడ్ ఫీట్ అందరికీ ఆశ్చర్యంగా ఉంది.