కరోనా కష్టకాలంలో సినిమా షూటింగ్ ల పరిస్థితీ మారేలా ఉంది. బిగ్ బాస్ హౌస్ లాగా ఆర్టిస్ట్ లు, టెక్నీషియన్లు అందరూ హౌస్ అరెస్ట్ అవ్వాల్సిందే. ముందుగా అందరూ కరోనా టెస్ట్ చేయించుకుని షూటింగ్ స్పాట్ లోకి అడుగు పెడితే, ఇక ఆ షెడ్యూల్ పూర్తయ్యాకే బైటకెళ్లాలనమాట. అంటే ఒకరకంగా ఐపీఎల్ కి ఏర్పాటు చేసినట్టు సినిమా షూటింగ్ లకు కూడా బబుల్ ఏర్పాటు చేస్తారు.