వ్యాక్సిన్ వచ్చాకే షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు సీనియర్ హీరోలు. ఆర్ఆర్ఆర్ కూడా భారీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమా కావడంతో దీని షూటింగ్ కూడా ఇప్పుడప్పుడే మొదలు కాదు. వ్యాక్సిన్ వచ్చి పరిస్థితులన్నీ అనుకూలించిన తర్వాతే సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనుకుంటున్నారు రాజమౌళి. అయితే ఈలోగా రామ్ చరణ్, ఎన్టీఆర్ బాగా డిస్ట్రబ్ అయ్యారని తెలుస్తోంది. భారీ అంచనాలు పెట్టుకున్న సినిమా అర్థాంతరంగా ఆగిపోవడం ఒక కారణమైతే, అసలు ఎప్పుడు తిరిగి షూటింగ్ లకి వెళ్లాలో తెలియని పరిస్థితి మరో కారణం.