ఫస్ట్ లీజింగ్ కంపెనీ ఆఫ్ ఇండియా కో-ప్రమోటర్, మాజీ చైర్మన్ ఏసీ ముత్తయ్యను ఐడీబీఐ బ్యాంకు ‘‘ఉద్దేశపూర్వక ఎగవేతదారు’’గా ప్రకటించింది. ఆగస్టు 27 నాటికి ముత్తయ్య, ఫస్ట్ లీజింగ్ ప్రమోటర్ డైరెక్టర్ ఫరోక్ ఇరానీ రూ.508.40 కోట్లు చెల్లించపోవటంతో చట్ట ప్రకారం డీఫాల్టర్లుగా నిలిచినట్టు బ్యాంకు తెలిపింది . కాగా ఇప్పటికే ఈ కంపెనీ అక్రమంగా నిధులు తరలించిందన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ, ఈడీ సహా పలు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.