సెప్టెంబర్ 1 నుంచి ఆరో విడత ‘వందే భారత్ మిషన్’ ప్రారంభం కానున్న ఈ నేపథ్యంలో టికెట్ల బుకింగ్‌కు సంబంధించి.. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 1-30 మధ్య ప్రయాణించడానికి టికెట్స్ బుకింగ్స్‌ను ప్రారంభించినట్లు వెల్లడించింది. ఆరో విడత ‘వందే మిషన్’లో భాగంగా.. యూఏఈ నుంచి ఇండియాలోని 18 నగరాలకు దాదాపు 400 విమానాలను నడపనున్నట్లు పేర్కొంది.