రాయలసీమ ఎత్తిపోతల పథకంపై హైకోర్టులో విచారణ జరిగింది. అంతర్రాష్ట్ర జలవివాదం కాబట్టి సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం విచారణ జరపాలని పిటిషనర్ కోరగా.. ఇరు రాష్ట్రాల జలవివాదం హైకోర్టు పరిధిలోకి ఎలా వస్తుందని ధర్మాసనం ప్రశ్నించింది. పిటిషనర్లతో చర్చించి చెబుతామని న్యాయవాది తెలపడంతో.. విచారణ రేపటికి వాయిదా వేసింది.