టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి... బాబు గారు జోకర్ గా ఎందుకు మారుతున్నారని ఎద్దేవా చేసారు. "బాబు గారు.. వీధిలో జరిగే గొడవలన్నింటిని ప్రభుత్వానికి అంటగడుతున్నారు. చివరికి ఇంట్లో జరిగిన సంఘటనకి కూడా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు. మీ మానసిక స్థితిపై ప్రజలకు అనుమానంగా వుంది. జనాలు నవ్వుకుంటున్నారు. రోజు రోజుకి మరీ జోకర్ లా ఎందుకు మారుతున్నారు?" అని విజయ సాయి ట్వీట్ చేసాడు.