గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ నేతల భూకబ్జా బయటపడింది. సర్వేనెంబర్ 147లోని భూమికి నకిలీ పత్రాలు సృష్టించి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించినట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడ ఉన్న కట్టడాలను భూకబ్జాదారులు ధ్వంసం చేశారు. దీంతో కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగిన బాధితులు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు. వినతిపత్రం అందజేశారు.