ఢిల్లీ: రాజధాని అమరావతికి సంబంధించి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఓ కీలక చట్టం గురించి చెప్పారు. అమరావతి రైతులతో సీఆర్డీఏ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం రాజధాని అమరావతే అని, ఒప్పందంలో ప్రామిసరి ఎస్టాపుల్ అని 1872 నాటి చట్టాన్ని ప్రస్తావించారని, దాని ప్రకారం రాజధాని అక్కడే కొనసాగుతుందని అన్నారు.