దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి పదవికి వన్నెతెచ్చిన సీనియర్ రాజకీయ వేత్త ప్రణబ్ ముఖర్జీ కన్నమూతతో దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలముకున్నాయి. గత కొన్నిరోజులుగా కొవిడ్ తో పోరాడుతూ ఆస్పత్రిలోనే ఉన్న ప్రణబ్ ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించి తుది శ్వాస విడిచారు. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి నివాళిగా ఏడు రోజులపాటు సంతాప దినాలు పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలను స్మరించుకునేందుకు ఏడురోజులపాటు సంతాపం ప్రకటిస్తున్నట్టు కేంద్రం తెలిపింది.