మంచు మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ పై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఇంతకీ మంచు విష్ణు ఏమని ట్వీట్ చేశారో తెలుసా..? "థియేటర్లు తెరవండి, సినిమాని బతికించండి అని". అయితే కరోనా కష్టకాలంలో ఈ ట్వీట్ దుమారాన్ని రేపింది. నెగెటివ్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీంతో అందరూ విష్ణుని చెడుగుడు ఆడుకుంటున్నారు. విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు.