వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దుర్గగుడి ఫ్లైఓవర్ కి సంబంధించి దాదాపుగా 30శాతం పనులు పూర్తయ్యాయి. అంటే టీడీపీ గతంలో చేసింది 70శాతం మాత్రమేనని అర్థమవుతుంది. ఐదేళ్లలో ఒక ఫ్లైఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబుకి వైసీపీని విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ నేతలంటున్నారు. ఇలా సగం సగం పనులు చేసినందుకే గత ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అంటున్నారు.