సోలో బతుకే సో బెటర్ అనే సినిమా లాక్ డౌన్ వల్ల ఆగిపోయింది. ప్రస్తుతం ఈ సినిమాని ఓటీటీకి ఇవ్వాలనుకుంటున్నారు. దీంతో బ్యాలెన్స్ పార్ట్ చకచకా పూర్తి చేయాలనుకుంటున్నారు దర్శక నిర్మాతలు. అందుకే సోమవారం నుంచి సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో మొదలైంది. సాయి ధరమ్ తేజ్ సహా ఇతర కీలక నటులు ఈ షూటింగ్ లో పాల్గొన్నారు.