శాసనమండలి ఛైర్మన్ షరీఫ్ కరోనా బారిన పడటంపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మండలి చైర్మన్ షరీఫ్ కరోనా వైరస్ బారిన పడడం బాధాకరం అని నారా లోకేష్ అన్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ లోకేష్ ట్వీట్ చేశారు.