భారత్-చైనా సరిహద్దుల్ని కచ్చితంగా నిర్ణయించలేదని.. అందువల్ల ఎప్పటికీ వివాదాలు తలెత్తే అవకాశం ఉందంటూ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి సమస్యనైనా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు. ఇరు దేశాల మధ్య జరిగే ద్వైపాక్షిక చర్చల్లో సరిహద్దు వివాదాల్ని సైతం చేర్చాల్సిన అవసరం ఉందన్నారు. .