యువత అంతా ఇప్పుడు సిక్స్‌ప్యాక్, ఎయిట్ప్యాక్ కోసం శ్రమ పడుతున్నారు. నన్ను చాలా మంది మీరెందుకు సిక్స్ ప్యాక్ కోసం ప్రయత్నించలేదని అడుగుతుంటారు. అయితే నాకు వాటిపై ఎప్పుడూ ఆసక్తిలేదు. నేను ధైర్యం అనే బలం కోసం పనిచేసేవాడిని. కండలు పెంచడం చాలా సులువు. అదే గుండె ధైర్యాన్ని పెంచాలంటే చాలా కష్టం. దానికి పిరికితనాన్ని జయించాలి. ఓ రాజకీయ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ ధైర్యం ఎంతో కావాలి- పవన్