తెలంగాణాలో కరోనా కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. నిన్న కూడా 2800 పైగా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 59 వేల 711 మందికి కరోనా పరిక్షలు చేయగా నిన్న ఒక్క రోజే 2 వేల 817 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కరోనా నుంచి రికార్డ్ స్థాయిలో 2 వేల 611 మంది కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 10 మంది ప్రాణాలు కోల్పోయారు.