ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్లీ జోస్యం చెప్పారు. ఐపీఎల్ కవరేజీలో భాగంగా అతడు ముంబయి వచ్చాడు. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉంటున్నాడు. ఇన్స్టాగ్రామ్లో తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఈసారి ఐపీఎల్ విజేతగా ఎవరు నిలుస్తారని ఓ అభిమాని ప్రశ్నించగా, దీనికి సమాధానం చెప్పడం కొంత కష్టమేనన్నాడు. అయినప్పటికీ సీఎస్కే విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు.