తాజాగా హైదరాబాద్ లో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఫిలీంనగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో భారీ వర్షం కురిసింది. అలాగే సైదాబాద్, మలక్పేట, ముషీరాబాద్, చాదర్ఘాట్, రాంనగర్, చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్, రాజేంద్రనగర్ సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. గత కొద్ది రోజులుగా ఎండి వేడిమితో ఇబ్బంది పడుతున్న ప్రజలకు భారీ వర్షంతో ఉపశమనం లభించింది. పలు ప్రాంతాల్లో రోడ్డుపైకి వర్షపునీరు చేరడంతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.