కోర్సుల్లో ప్రవేశ పరీక్షల తేదీలను మారుస్తూ కొత్త తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర లాసెట్, పీజీ లా సెట్ పరీక్ష తేదీల్లో మార్పు చోటుచేసుకుంది. అక్టోబర్ 4కి బదులు అక్టోబర్ 9న పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ముందు ప్రకటించిన అక్టోబర్ 4న మరో పరీక్ష ఉండడంతో తేదీ మార్పు చేసినట్లు లాసెట్, పీజీ లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ జీబీ రెడ్డి తెలిపారు. ప్రవేశ దరఖాస్తుల తేదీని సైతం పొడిగించినట్లు చెప్పారు. రూ. 4 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 20వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకొచ్చన్నారు.