తెలంగాణ ఈసెట్-2020 కు సంబంధించిన ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి.ఈ మేరకు ఫలితాలను ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి. పాపిరెడ్డి రేపు సాయంత్రం 4 గంటలకు జేఎన్టీయూ ప్రాంగణంలోని యూజీసీ-హెచ్ఆర్డీసీ ఆడిటోరియంలో విడుదల చేయనున్నారు. అధికారి వెబ్సైట్ ecet.tsche.ac.in నుంచి విద్యార్థులు ర్యాంక్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు.