తాజాగా అసోం ప్రభుత్వం కరోనాతో చనిపోయిన వారి కోసం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కష్ట కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్ర ప్రభుత్వం వారికి భరోసా కల్పిస్తోంది. కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి అంత్యక్రియలకు ఖర్చులు భరించలేని కుటుంబాలకు రూ.5,000 చొప్పున ఆర్థిక సాయం ప్రకటించింది. నేషనల్ హెల్త్ మిషన్ నుంచి బాధిత కుటుంబాలకు ఈ సాయం అదిస్తామని అసోం ప్రభుత్వం జీవో జారీ చేసింది. కొవిడ్ తో చనిపోయిన వారి మృతదేహాలు అందకపోయినా, అంత్యక్రియల ఖర్చులు భరించలేకపోయినా రూ.5,000 వరకూ ఖర్చులు నిమిత్తం చెల్లించాలని నిర్ణయించినట్టు అసోం ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది.