అంతర్వేదిలో రథం తగలబడిన ఘటనలో చంద్రబాబు ప్రమేయం ఉందని సంచలన ఆరోపణలు చేశారు రోజా.. గతంలో రైలు దహనం, రాజధాని భూములు తగలు బెట్టించిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించిన ఆమె.. సీబీఐ రాష్టానికి రావద్దని జీవో ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సీబీఐ విచారణ కోరుతున్నారంటూ ఎద్దేవా చేశారు. తమ చిత్తశుద్ది నిరూపించుకునేందుకు సీఎం వైఎస్ జగన్... అంతర్వేది ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశించారని తెలిపారు రోజా.