తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల13 న యాదాద్రి కి వెళ్లనున్నారు. అక్కడి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించడానికి గాను ఆయన ఎల్లుండి అక్కడికి వెళ్లనున్నట్టు సమాచారం. ఇప్పటికే యాదాద్రి కి సంబంధించిన ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ యాదాద్రి ఆలయ నిర్మాణాన్ని తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.