ఆంధ్రప్రదేశ్ లోగడిచిన 24గంటల్లో 76,465 శాంపిల్స్‌ను పరీక్షించగా.. 9901 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో 67 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 45,27,593 శాంపిల్స్ పరీక్షించగా.. 5,57,587 మందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. వీరిలో ఇప్పటికే 4,57,008 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 4846 మంది ప్రాణాలు కోల్పోయారు.