ఇప్పటి నుండి ఎవరైనా అసెంబ్లీ సమావేశాలకు రావడానికి ముందే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరోసారి కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. సోమవారం అసెంబ్లీ ప్రారంభమయ్యేలోపు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అందరి శ్రేయస్సు దృష్ట్యా సభ్యులందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సమావేశాలకు హాజరయ్యే అధికారులు ఆదివారం సాయంత్రం పరీక్షలు చేయించుకోవాలని పోచారం, గుత్తా తెలిపారు.