కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నే గడగడ లాడిస్తోంది.ఇప్పటికే మన దేశంలో 46 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. సామాన్య ప్రజలు ఈ మహమ్మరి వల్ల జీవనోపాధి కోల్పోతున్నారు. ఈ వైరస్ కి మందును కనిపెట్టే ప్రయత్నంలో మన దేశం లోని శాస్త్రజ్ఞులు ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా హైదరాబాద్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) సంస్థ కరోనాను నియంత్రించేందుకు కొత్త వ్యాక్సిన్ ను కనుగొంది.నెబులైజర్ ఆధారంగా పనిచేసే మందును తయారు చేసింది.లైఫ్ యాక్టివస్, సుప్రీం ఇండస్ట్రీస్ సంయుక్తఆధ్వర్యంలో ‘లైఫ్ వైరోట్రీట్’ అనే వ్యాక్సిన్ ను తయారు చేసింది.