హీరోయిన్ సమంత ఈ మధ్య ఎక్కువ సమయం జిమ్ లోనే గడుపుతోంది.  అయితే జిమ్ చేసేది బాడీ షేప్ కోసం కాదని.. నాకు వర్కౌట్స్ చెయ్యడం చాల ఇష్టం.. కేవలం శరీరాకృతుల కోసమే జిమ్ చెయ్యడం లేదు.. జిమ్ చేస్తే నాకు ఉత్సాహం, సంతోషం వస్తాయంటుంది సమంత. జిమ్ చెయ్యడం వలన నాలోని హ్యాపీ హార్మోన్స్ విడుదలయ్యి నేను సంతోషం గా ఉండేలా చేస్తుంది.అందుకే నేను ఎక్కువగా జిమ్ చేస్తుంటాను అంటుంది.