ఎన్నికల కమిషన్ లో కొన్ని పోస్టులని ప్రభుత్వం భర్తీ చెయ్యలేదని నిమ్మగడ్డ ఆరోపించాడు. అయితే ఈ విషయంలో ఎలాంటి ఆధారాలు లేకపోవడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎత్తి చూపింది. హైదరాబాద్ లోని తన నివాసం వద్ద పని చేసేందుకు అడిషనల్ అటెండర్ పోస్టులు భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నిమ్మ గడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు.   హైదరాబాద్ లోని తన నివాసాన్ని అధికారిక నివాసంగా ప్రకటించాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ వాదించాడు. ఇక నిమ్మగడ్డ తీరుపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడ లో ఒక అధికార నివాసం, హైదరాబాద్ లో ఒక నివాసం ఎందుకని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని హైకోర్టు ప్రశ్నించింది. ఇది పూర్తిగా ప్రజాధనాన్ని వృధా చెయ్యటం అని హై కోర్టు తెలియజేసింది. మొత్తానికి ఈ విషయంలో నిమ్మగడ్డకి చుక్కెదురైంది..