ప్రస్తుతం రాజశేఖర్ ఆరోగ్యం బాగుందని ఆయన కుమార్తె శివాత్మిక తెలిపారు. డాడీ కోలుకుంటున్నారని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. హైదరాబాదులోని సిటీ న్యూరో ఆసుపత్రి బృందం తన తండ్రి ఆరోగ్యం కుదుటపడటానికి ఎంతో కృషి చేస్తోందని ఆమె వెల్లడించారు.