దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఎల్లుండి అనగా నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాదులోని బేగంపేటలో రూ.1 కోటి హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు.