ఉత్తర చైనాలోని షుజౌ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చైనాకు చెందిన ఒక వ్యక్తి అందరూ చూస్తుండగానే తన భార్యను నడి రోడ్డుపై కొట్టి చంపాడు. అయితే అక్కడి జనమంతా దీన్ని చోద్యంగా కళ్లప్పగించి చూశారే తప్ప ఏ ఒక్కరు కూడా ఆ మహిళను అతడి బారి నుంచి రక్షించేందుకు ప్రయత్నించలేదు.