ప్రముఖ బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఔత్సాహిక ఆటగాళ్లను సానబట్టేందుకు అకాడమీ నెలకొల్పిన సంగతి తెలిసిందే. హైదరాబాదు శివారు ప్రాంతం మొయినాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ అకాడమీని ఇవాళ తెలంగాణ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.