కాబూల్ దేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ అయిన కాబూల్ యూనివర్సిటీపై ఉగ్రవాదులు గ్రనేడ్లు, తుపాకులతో దాడి చేశారు. పేలుళ్లు, కాల్పుల శబ్ధాలతో కాబూల్ యూనివర్శిటీ ప్రాంగణం దద్దరిల్లింది. ఈ దాడిలో 19 మంది విద్యార్థులు మరణించినట్లు ప్రాథమిక సమాచారం.