పది నెలల తర్వాత పలు రాష్ట్రాల్లో పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే పాఠశాల ప్రారంభమైన మొదటి రోజే ఓ విద్యార్థికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో ఆ విద్యార్థి కలిసిన 15 మంది విద్యార్థులను ఐసోలేషన్ వార్డుకు తరలించారు. ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని రానీఖేట్ లో చోటు చేసుకుంది.