వయోలిన్ విద్వాంసుడు టీఎస్ కృష్ణన్ (92) స్వర్గీయులయ్యారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ సోమవారం సాయంత్రం అస్వస్థతకు గురయ్యారు. పరిస్థితి విషమించడంతో ఆయన తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు.