ఇండియా నుంచి వచ్చే వారికి చైనా తాత్కాలికంగా నో ఎంట్రీ అనేసింది. వందే భారత్ మిషన్ కింద నడుపుతున్న ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీసులను తదుపరి ఆదేశాల జారీ చేసే వరకు నిలిపివేసినట్లు తెలిపింది. భారత్లో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు గురువారం ప్రకటించింది.