టీవీ ఆఫ్ చేయమంటే ఆఫ్ చేయలేదన్న కోపంతో తండ్రిని కాల్చి చంపాడో మాజీ ఆర్మీ ఉద్యోగి. ఈ విషాదఘటన ఉత్తర ప్రదేశ్లో చోటుచేసుకుంది. అశోక్ కథిహార్ ఓ మాజీ ఆర్మీ ఉద్యోగి.. అతను కుటుంబంతో కలిసి ఉత్తరప్రదేశ్లోని నసీర్పుర్లో నివాసం ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి అతడి తండ్రి లాలా రామ్ టీవీ చూస్తున్నాడు.