దక్షిణ కేరళలో సుమారు 1,200 దేవస్థానాలను పర్యవేక్షిస్తున్న ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) పార్ట్ టైమ్ బేసిస్లో పురోహితులను నియమించింది. ఇక అందులో భాగంగా 19 మంది నిమ్నకులాలకు చెందినవారిని నియమించనున్నట్టు నిర్ణయం తీసుకుంది. అంతేకాదు 18 మంది ఎస్సీలు, ఒక ఎస్టీ వర్గానికి చెందిన వ్యక్తిని పార్ట్ టైమ్ ఆలయ పూజారిగా నియమించనుంది.