తెలంగాణాలో చదువుల తల్లి లోకాన్నే విడిచి వెళ్లిపోయింది. చదువుకునేందుకు ఆర్థిక స్తోమత సరిపోక ఆత్మహత్యకు పాల్పడింది. చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్న బలమైన కాంక్ష ఒకవైపు, కాలేజ్ రుసుము, హాస్టల్ ఫీజు కట్టలేనంత పేదరికం మరోవైపు, చివరికి ఆ చిట్టితల్లి చచ్చిపోవాలనే నిర్ణయానికి వచ్చింది.