బాలీవుడ్ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు అసిఫ్ బాస్రా ధర్మశాలలోని ఓ ప్రైవేట్ కాంప్లెక్స్ లో ఆత్మహత్య చేసుకున్నారు. ధర్మశాలలోని మెక్లాడ్గంజ్లోని అద్దె ఇంట్లో గత ఐదేళ్ల నుంచి ఉంటున్నారు. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రాథమిక విచారణలో తేలింది.