ఎప్పుడైతే కరోనా కారణంగా లాక్ డౌన్ మొదలైందో అప్పటి నుంచి కొంతమందిలో RRR  సినిమా మీద అంచనాలు .. అభిప్రాయాలు మారుతూ .. తగ్గుతూ వచ్చాయి. కాగా మధ్యలో భీం ఫర్ రామరాజు టీజర్ వచ్చి మళ్ళీ సినిమా మీద భారీ అంచనాలు పెంచేసింది. రాజమౌళి సత్తా గురించి మరోసారి అందరూ గొప్పగా చెప్పుకున్నారు.కాని లాక్ డౌన్ ఎప్పటికప్పుడు పొడగిస్తూ రావడంతో పెద్ద గ్యాప్ లేకుండా వస్తుందనుకున్న రామరాజు ఫర్ భీం కి నెలల గ్యాప్ వచ్చేసింది.కరోనా కొట్టిన దెబ్బతో అన్ని సినిమాల లెక్కలు, అంచనాలు తారుమారయ్యాయి. సరిగ్గా అదే సమయంలో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తిరిగి మొదలు పెట్టిన రాజమౌళి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రామరాజు ఫర్ భీం టీజర్ ని వదిలి మళ్ళీ సినిమా మీద అంచనాలు పెంచేశాడు. అంతేకాదు తాజాగా దీపావళి పండగ సందర్భంగా రాజమౌళి, ఎన్.టి.ఆర్, రాం చరణ్ ల స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చి ఆ అంచనాలని ఇంకాస్త పెంచాడు. మొత్తానికి ఆర్ ఆర్ ఆర్ మ్యానియా మొదలైనట్టే. ఖచ్చితంగా ఆర్ ఆర్ ఆర్ తో తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరు ఊహించని మిరాకిల్ జరగడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.