ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు వస్తుండగా అరెస్టైన కేరళ జర్నలిస్ట్ సిద్ధిఖీ కప్పన్ మధ్యంతర బెయిల్ మంజూరు చేసేందుకు దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. యూపీ ప్రభుత్వానికి నోటీసును జారీ చేసింది. హత్రాస్ ఘటనను కవర్ చేసేందుకు ఢిల్లీ నుంచి యూపీ బయల్దేరిన సిద్ధిక్ ను పోలీసులు గత అక్టోబరు 5 న అరెస్టు చేశారు.