నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి కరోనా సోకింది. సోమవారం ఆయన పాల్గొనవలసిన పాదయాత్రను పట్టణ అధ్యక్షుడు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎమ్మెల్యే తో పాటు ఎఎంసి చైర్మన్ మన్నెమాల సుకుమార్ రెడ్డికి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినది.