శ్రీలంక,జింబాబ్వే కు చెందిన మాజీ ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో బస్సు డ్రైవర్లుగా ఉపాధి పొందుతున్నారు. శ్రీలంక జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సూరజ్ రణదీప్, చింతక జయ సింఘ్ , జింబాబ్వే మాజీ ఆటగాడు వాడింగ్టన్ ఎంవేయంగా ప్రస్తుతం మెల్ బోర్న్ లో స్థానికంగా ఉన్న ఒక క్లబ్ తరఫున క్రికెట్ ఆడుతూనే, మరోవైపు ట్రాన్స్ డెవ్ అనే ఫ్రెంచ్ కంపెనీకు చెందిన బస్సులు నడుపుతున్నారు.క్రికెట్ ద్వారా తమకు వచ్చే ఆదాయం చాలా తక్కువ అని, తమ కుటుంబాలను పోషించడం కోసం బస్సు డ్రైవర్ లుగా చేరామని వారు చెబుతున్నారు.