ఏపీ సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం వైఎస్ఆర్ వాహనమిత్ర. ఈ పథకం ద్వారా సొంతంగా ఆటో నడుపుకుంటున్న ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్ లకు ఏడాదికి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా గత రెండేళ్ల నుండి ముఖ్యమంత్రి జగన్ దరఖాస్తు చేసుకున్న వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా డ్రైవర్ లకు రూ.10 వేలు అందించేందుకు జగన్ శ్రీకారం చుట్టారు. ఈ రోజు ఆన్లైన్ ద్వారా పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేయనున్నారు. దాంతో అర్హులందరి ఖాతాల్లో 10వేలు